తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు బోర్డు కీలక అప్‌డేట్ అందించింది. ఫస్టియర్ సబ్జెక్టుల్లో రిపీటయిన పాఠాలను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే విద్యార్థులపై ఒత్తిడి తగ్గేలా పుస్తకాల్లో QR కోడ్‌లను పొందుపరిచి వీడియో, ఆడియో రూపంలో పాఠాలు వినేలా రూపొందించింది. తెలుగులో రాష్ట్ర సంస్కృతి ప్రతిబింబించే పాఠ్యాంశాలు, Mathsలో 'Do you know' బాక్సులు, సైంటిస్టుల ఇంట్రడక్షన్, Physicsలో AI ఫిజిక్స్ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంశాన్ని ప్రవేశపెట్టింది. సైన్స్ సబ్జెక్టులను NCERT సిలబస్‌కు అనుగుణంగా మార్చింది.