స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ జీతాల ఖాతాదారులకు ఉచిత ఏటీఎం ఉపసంహరణల పరిమితిని తగ్గించింది. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలకు లభించే 10 ఉచిత లావాదేవీల పరిమితిని 5కి తగ్గించారు. ఈ నిబంధన ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలు రెండింటికీ వర్తిస్తుంది. ప్రాథమిక సేవింగ్స్ డిపాజిట్ (బీఎస్బీడీ) ఖాతాదారులకు 4 ఉచిత ఉపసంహరణలు యథాతథంగా కొనసాగుతాయి. పరిమితి దాటితే రూ.15 + జీఎస్టీ ఛార్జ్ పడుతుంది. డిజిటల్ లావాదేవీలు మాత్రం ఉచితంగానే ఉంటాయి.