కృష్ణాష్టమి రోజున ఈ నామం జపించండి: పండితులు

శ్రీకృష్ణుని ప్రతి నామానికి ప్రత్యేక అర్థం, ప్రాధాన్యత ఉందని భక్తులు విశ్వసిస్తారు. 'గోవింద', 'మాధవ', 'కేశవ', 'గోపాల', 'అచ్యుత', 'వాసుదేవ' వంటి నామాలను జపించడం వల్ల మనస్సుకు ప్రశాంతత చేకూరుతుందని, ప్రతికూల ఆలోచనలు తగ్గుతాయని నమ్మకం. జన్మాష్టమి రోజున 108 నామాలను జపిస్తూ ఒక్కో నామానికి తులసి ఆకు లేదా పసుపు పువ్వును సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. 'గోవింద' అంటే గోవులను, ఇంద్రియాలను రక్షించేవాడు. 'మాధవ' అంటే జ్ఞానానికి అధిపతి, లక్ష్మీదేవి భర్త. 'గోపాల' కృష్ణుడి బాల్య లీలలను, గోవుల సంరక్షణను సూచిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕