లోక్‌స‌భ‌లో గంద‌ర‌గోళం.. రాజ్య‌స‌భ‌లో మాట్లాడ‌నున్న ప్ర‌ధాని మోదీ

లోక్‌సభలో విపక్ష ఎంపీలు ఆందోళన కొనసాగించడంతో గురువారం సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. బుధవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ చేయాల్సిన ప్రసంగాన్ని విపక్ష ఎంపీలు అడ్డుకున్నారు. దీంతో ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అయితే, ఆయన రాజ్యసభలో తన ప్రసంగాన్ని చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకే రోజు రెండు సభల్లోనూ ధన్యవాద తీర్మానాన్ని పాస్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

సంబంధిత పోస్ట్