TG: సభలో సభ్యులందరికీ సమాన హక్కులు ఉంటాయని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఈ సభ మీ సొంతం కాదని స్పీకర్‌ను ఉద్దేశించి అన్నారు. దీంతో స్పీకర్‌పై చేసిన వ్యాఖ్యలకు జగదీష్ రెడ్డి క్షమాపణ చెప్పాలని మంత్రి శ్రీధర్ బాబు, కాంగ్రెస్ సభ్యులు డిమాండ్ చేశారు. జగదీశ్ రెడ్డి తప్పేమీ మాట్లాడలేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అధికార, విపక్షాల ఆందోళనతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.