తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు రెండో రోజు ఉత్కంఠభరితంగా సాగాయి. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతపై చర్చించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ (BRS) సభలో భారీ నిరసనకు దిగింది. బీఆర్ఎస్ఎల్పీ నేతలు చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని, 'కాంగ్రెస్ వచ్చింది.. రైతులను నిండా ముంచింది' అంటూ నినాదాలు చేశారు. రైతులకు సకాలంలో యూరియా అందక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే సరఫరాను మెరుగుపరచాలని వారు డిమాండ్ చేశారు.