రూ.2000 లోపు వ్యక్తుల మధ్య జరిగే లావాదేవీలు, రూపే డెబిట్ కార్డు సేవలు ఉచితమని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఇండియా (NPCI) వెల్లడించింది. వ్యక్తులు-వ్యాపారుల మధ్య జరిగే ట్రాన్సాక్షన్స్లో 96% ఉచితమని, ప్రభుత్వ సేవలు కూడా ఫ్రీగానే ఉంటాయని NPCI తెలిపింది. రూ. 2వేలు దాటితే MDR కింద రూ.5 చొప్పున ఛార్జీ ఉంటుందని వివరించింది. దేశీయ చెల్లింపుల వ్యవస్థను నిలకడగా కొనసాగించడం, భారత ఫిన్టెక్లోకి పెట్టుబడులను ఆకర్షించడం కోసమే MDR అని పేర్కొంది.