యూపీఐ వాణిజ్య లావాదేవీలపై కొత్త ఎండీఆర్ ఛార్జీల విధానాన్ని సవాలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ఎండీఆర్ విధానంపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు సీజేఐ ధర్మాసనం నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్పైనా స్టే ఇవ్వలేదు. యూపీఐ వాణిజ్య లావాదేవీలపై ఛార్జీల విధానం, వాటికి ఉన్న ప్రాతిపదికపై సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.