చాట్‌జీపీటీ అరుదైన మైలురాయి.. మంత్లీ 1 బిలియన్ యూజర్లు

ఓపెన్‌ఏఐకి చెందిన చాట్‌జీపీటీ యాప్ అరుదైన మైలురాయిని చేరుకుంది. మే నెల నాటికి 1 బిలియన్ నెలవారీ యూజర్ల మార్కును దాటినట్లు సెన్సార్ టవర్‌ వెల్లడించింది. యాప్ లాంచ్ చేసిన మూడేళ్లలోనే ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే తొలి ఏఐ యాప్‌గా చాట్‌జీపీటీ అవతరించింది. టిక్‌టాక్‌కు 5 ఏళ్లు, ఇన్‌స్టాగ్రామ్‌కు 8 ఏళ్లు పట్టిన ఈ మైలురాయిని చాట్‌జీపీటీ వేగంగా అధిగమించింది. అయితే, ఆంథ్రోపిక్ క్లాడ్ యాప్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. చాట్‌జీపీటీ 62% వృద్ధి సాధించగా, క్లాడ్ 640% వృద్ధితో దూసుకెళ్తోంది.

సంబంధిత పోస్ట్