చాట్‌జీపీటీ సేవల్లో అంతరాయం.. అమెరికాలో వేలాది ఫిర్యాదులు

ఓపెన్‌ఏఐకు చెందిన ప్రముఖ ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ సేవల్లో మంగళవారం అమెరికాలో భారీ అంతరాయం ఏర్పడింది. డౌన్‌డిటెక్టర్ ప్రకారం, యూఎస్‌లో వేలాది మంది వినియోగదారులు సేవలు అందుబాటులో లేవని ఫిర్యాదు చేశారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:25 గంటల వరకు 12,000కు పైగా యూజర్లు తమకు చాట్‌జీపీటీ పనిచేయడం లేదని రిపోర్ట్ చేశారు. భారత్‌లో మాత్రం ఈ అవుటేజ్ ప్రభావం కనిపించలేదు. అమెరికాలో చాలా మందికి 'Hmm… something seems to have gone wrong' అనే ఎర్రర్ మెసేజ్ కనిపించింది. టెక్‌రాడార్ కథనం ప్రకారం, హంగేరీ వంటి కొన్ని దేశాల్లో కూడా సేవలు సరిగా అందలేదు. ఐర్లాండ్, కెనడా, భారత్, పోలాండ్ వంటి దేశాల్లో చాట్‌జీపీటీ మామూలుగా పనిచేస్తోంది. అయితే భారత్, పోలాండ్‌లో కొద్దిగా నెమ్మదిగా ఉంది. ఓపెన్‌ఏఐ స్పందిస్తూ, సమస్యను గుర్తించి పరిష్కార చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్