కొవిడ్-19 వ్యాక్సిన్ల కారణంగా యువతలో ఆకస్మిక మరణాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు తప్పని ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులు తేల్చారు. గుండెపోటుతో ఆకస్మిక మరణాలకు వ్యాక్సిన్లే కారణమని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన వైద్యులు కొవిడ్ చికిత్సపై మరిన్ని పరిశోధనలు చేయాలని నిర్ణయించారు. అలాగే వ్యాక్సిన్లను తక్కువ ధరలో అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు.