TG: హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్ పోలీసులకు ఓ యువతి ఫిర్యాదు చేసింది. లకిడీకాపూల్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శెట్టి అరుణ్ కుమార్ (34) తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆరోపించింది. ఎంటెక్ చదువుతున్న(2013-15) సమయంలో పరిచయమై, పెళ్లి చేసుకుంటానని నమ్మించి దగ్గరయ్యాడని తెలిపింది. రెండుసార్లు గర్భం దాల్చగా అబార్షన్ చేయించాడని, కులం కారణంగా పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చాడని తెలిపింది. అయితే, 2026 జూలై 1న మరో మహిళను వివాహం చేసుకున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.