ప్రేమ పేరుతో మోసం.. యువతి ఆత్మహత్య

బెంగళూరుకు చెందిన 22 ఏళ్ల యువతి, ప్రేమ పేరుతో మోసపోయి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం వెలుగు చూసింది. ప్రైవేట్ ఫోటోలు చూపించి బెదిరించి లైంగికంగా వాడుకున్నారని, గర్భం దాల్చిన తర్వాత గర్భస్రావం చేయించారని ఆవేదన వ్యక్తం చేస్తూ డెత్‌నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. తుమకూరు జిల్లాకు చెందిన అభి అనే యువకుడు తనను బ్లాక్‌మెయిల్ చేసి మోసం చేశాడని యువతి పేర్కొంది. ఈ ఘటనపై రామనగర రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్