మెగా ప్రిన్సెస్ క్లీంకార ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన తాతతో క్లీంకార ఆలయాన్ని సందర్శించిన ఫోటోను ఉపాసన షేర్ చేశారు. 'ఈ రోజు మా హాస్పిటల్ టెంపుల్‌లోని వెంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాల్లో తన ముత్తాతలతో కలిసి క్లీంకార పాల్గొంది. తాత చేతుల్లో తనను చూస్తుంటే నా బాల్యం గుర్తొస్తోంది' అని ఆమె పేర్కొన్నారు. క్లీంకార చూస్తుండగానే పెరిగిపోయిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే క్లీంకార ఫేస్ కనిపించకుండా ఉపాసన ఫోటో రిలీజ్ చేశారు.