కాలం వేగంగా మారుతున్న తరుణంలో, జీవనశైలీ మార్పులతో ఒత్తిడి, ఆందోళన పెరుగుతున్నాయి. దీన్ని తగ్గించేందుకు సుదీర్ఘ ధ్యానం చేయడానికి సమయం లేని వారికి ‘మైక్రో మెడిటేషన్’ కొత్త పరిష్కారంగా మారిందని నిపుణులు చెప్తున్నారు. ఈ విధానంలో 30 సెకన్ల నుంచి 5 నిమిషాల వరకే ధ్యానం చేస్తారు. నడక మధ్యలో, ఆఫీస్‌లో బ్రేక్‌లో, భోజనానికి ముందు కాసేపు శ్వాసపై దృష్టి పెట్టడం ద్వారా మెదడు ప్రశాంతమవుతుంది. స్ట్రెస్ హార్మోన్లు తగ్గి, ఫోకస్ పెరుగుతుందని అంటున్నారు.