వెల్లుల్లి టీతో ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వేడి నీటిలో దంచిన వెల్లుల్లి, ఒక చెంచా నల్ల మిరియాలు వేసి మరిగించి, ఫిల్టర్ చేసి తాగాలి. ప్రతిరోజు ఉదయాన్నే వెల్లుల్లి టీ తాగడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. ఇది డయాబెటిక్ పేషెంట్లకు మేలు చేస్తుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.