బొప్పాయి పండు తిని గింజలు పారేస్తున్నారా.. అయితే మీరు అమూల్యమైన ఆరోగ్యాన్ని వదులుకుంటున్నట్లే. ఈ నల్లటి గింజల్లో ఫైబర్, ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా.. శరీరంలోని వ్యర్థాలను తొలగించడంలో సహజ ఔషధంగా పనిచేస్తాయి. వీటిని ఎండబెట్టి పొడి రూపంలో తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కిడ్నీలు, లివర్ ఆరోగ్యాన్ని రక్షించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి