మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కులో చీతాలు విశ్రాంతి తీసుకుంటున్న దృశ్యాలను కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ షేర్ చేశారు. ఇది ‘ప్రాజెక్ట్ చీతా’ విజయానికి నిదర్శనమని తెలిపారు. వేట అనంతరం చీతాలు పచ్చిక బయళ్లలో హాయిగా విహరిస్తూ కనిపించాయి. ఆశా అనే చీతాకు చెందిన 18 నెలల మగ కూనలు సేదతీరుతున్న దృశ్యాలు వీడియోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.