పరిశ్రమలో రసాయన వాయువు లీక్.. ఊపిరాడక ముగ్గురి మృతి

కర్ణాటకలోని ఓ రసాయన పరిశ్రమలో బుధవారం ప్రమాదం చోటు చేసుకుంది. యాద్గిర్ మండలం కడేచూరులోని సీఐఎల్‌ ల్యాబ్‌లో రసాయన వాయువు లీక్ కావడంతో ఊపిరాడక ముగ్గురి మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండగా వారిని ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో తెలంగాణలోని నారాయణపేట జిల్లా కృష్ణ మండలం ఆలంపల్లికి చెందిన గణేష్ అనే వ్యక్తి కూడా ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్