నటి కస్తూరికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ చెన్నై ఎగ్మోర్ కోర్టు న్యాయమూర్తి దయాళన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఓ కార్యక్రమంలో నటి కస్తూరి మాట్లాడుతూ తెలుగు ప్రజలను అవమానించేలా అసభ్యకరంగా మాట్లాడారు. దాంతో నటి కస్తూరిపై 4 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి పరారీలో ఉన్న కస్తూరి కోసం గాలించి హైదరాబాద్‌లో ఉన్న ఆమెను అరెస్ట్ చేసి ఎగ్మోర్ కోర్టులో హాజరుపరిచారు.