ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాలో చెన్నై సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. జఖాపురా స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో మూడు బోగీలు ధ్వంసమయ్యాయి. ప్రాణనష్టంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైల్వే అధికారులు వెంటనే స్పందించి, భద్రక్ నుంచి రెస్క్యూ టీమ్‌ను ప్రమాద స్థలానికి పంపించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతోంది.