ఐపీఎల్ 2025లో భాగంగా లక్నో వేదికగా సోమవారం లక్నో సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టును ఫస్ట్ బ్యాటింగ్ చేసేందుకు ఆహ్వానించారు. అశ్విన్, కాన్వే స్థానంలో ఓవర్టన్, షేక్ రషీద్ జట్టులోకి వచ్చినట్లు ధోనీ తెలిపారు.