చియా గింజలు గుండె పనితీరును మెరుగుపరచడంతో పాటు, రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతాయని నిపుణులు చెబుతున్నారు. అధిక ఫైబర్ వల్ల బరువు తగ్గడానికి సహాయపడతాయి. అయితే, తక్కువ రక్తపోటు, కిడ్నీ సమస్యలు, రక్తం గడ్డకట్టకుండా మందులు వాడేవారు, జీర్ణకోశ సమస్యలు ఉన్నవారు వీటిని జాగ్రత్తగా, పరిమితంగా తీసుకోవాలి. అధికంగా తీసుకుంటే కడుపు ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలు తలెత్తవచ్చు.