భారీగా పెరిగిన చికెన్, గుడ్ల ధరలు

తెలుగు రాష్ట్రాల్లో చికెన్, కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగి వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడలో స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.340-350, డ్రెస్డ్ చికెన్ రూ.320 వరకు విక్రయిస్తున్నారు. బ్రాయిలర్ కోడి రిటైల్ ధర కిలో రూ.190గా ఉంది. డజను కోడిగుడ్ల ధర రూ.90-100కు చేరగా, ఒక్కో గుడ్డు రూ.8-8.50 పలుకుతోంది. కోళ్ల ఉత్పత్తి తగ్గడం, పౌల్ట్రీ ఫీడ్ ధరలు పెరగడం, సరఫరా లోపం, హోటళ్లు, శుభకార్యాల సీజన్‌తో డిమాండ్ పెరగడం వల్ల ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సంబంధిత పోస్ట్