భారీగా పెరిగిన కోడి గుడ్ల ధరలు

AP: రాష్ట్రంలో గుడ్ల ధరలు గణనీయంగా పెరిగాయి. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ నిర్ణయించిన రేట్ల ప్రకారం, విజయవాడలో 100 గుడ్ల ధర రూ.690కి చేరింది. అనపర్తి, తణుకులో రూ.665, విజయనగరం, శ్రీకాకుళంలో రూ.664, చిత్తూరులో రూ.663, విశాఖలో రూ.660గా ఉంది. రిటైల్లో ఒక్కో గుడ్డు రూ.8-10కి అమ్ముతున్నారు. నాలుగు నెలల క్రితం ఇదే ధర రూ.5.50గా ఉండేది. గుడ్ల ఉత్పత్తి తగ్గడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్