కొండెక్కిన చికెన్ ధరలు.. ప్రస్తుతం కిలో ఎంతంటే?

ఇప్పటికే పెట్రోల్, డీజిల్, కూరగాయల ధరలు పెరగడంతో సామాన్యుల జేబుకు చిల్లు పడుతుండగా, ఇప్పుడు చికెన్ ధరలు కూడా భారీగా పెరిగాయి. రెండు వారాల క్రితం కిలో రూ.250 ఉన్న చికెన్ ధర ఇప్పుడు రూ.300 దాటింది. హైదరాబాద్, కరీంనగర్, విజయవాడ వంటి నగరాల్లో కిలో చికెన్ రూ.300 నుంచి రూ.330 మధ్య విక్రయిస్తున్నారు. రవాణా ఖర్చులు పెరగడం, కోళ్ల ఉత్పత్తి తగ్గడమే దీనికి కారణమని వ్యాపారులు చెబుతున్నారు. చికెన్‌తో పాటు కోడి గుడ్ల ధరలు కూడా పెరిగాయి.

సంబంధిత పోస్ట్