భారీగా తగ్గిన చికెన్ ధరలు

తెలుగు రాష్ట్రాల్లో శ్రావణమాసం ప్రభావంతో చికెన్‌ ధరలు భారీగా తగ్గాయి. పది రోజుల క్రితం వరకు స్కిన్‌లెస్‌ చికెన్‌ కిలో రూ.280 నుంచి రూ.300 వరకు విక్రయించగా.. ప్రస్తుతం ధరలు రూ.220-రూ.240కు పడిపోయాయి. విజయవాడ, గుంటూరు, అనకాపల్లి ప్రాంతాల్లో ఈ ధరలకు కోడి మాంసం విక్రయిస్తున్నారు. తెలంగాణలోని హైదరాబాద్‌, వరంగల్‌ తదితర ప్రాంతాల్లోనూ దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నాయి. శ్రావణమాసంలో మాంసాహార వినియోగం తగ్గడంతో డిమాండ్‌ తగ్గింది. దీంతో చికెన్ ధరలు తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్