ఎండలకు కోళ్లు మృతితో పడిపోయిన గుడ్ల ఉత్పత్తి

పెరిగిన ఉష్ణోగ్రతలతో అనేక లేయర్‌ కోళ్లు చనిపోవడంతో కోడిగుడ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. గతంలో 95 శాతం ఉన్న ఉత్పత్తి ఇప్పుడు 65 శాతానికి పడిపోయింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దాణా ధరలు పెరగడంతో కోడిగుడ్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. పది రోజుల క్రితం రూ.180 ఉన్న ట్రే ధర ఇప్పుడు రూ.200కి చేరింది. హోల్‌సేల్‌లో ఒక్కో గుడ్డు రూ.6.60 ఉండగా, రిటైల్‌లో రూ.7 నుంచి రూ.8కి అమ్ముతున్నారు. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లోని కోళ్ల ఫారాల నుంచి రోజుకు సుమారు 70 లక్షల గుడ్లు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్