TG: సీఎం రేవంత్రెడ్డి బుధవారం ఉమ్మడి కరీంనగర్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం కరీంనగర్ కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం సీఎం సిరిసిల్లకు చేరుకోనున్నారు. సిరిసిల్ల అంబేడ్కర్ కూడలి నుంచి సభా ప్రాంగణం వరకు ర్యాలీగా వెళ్లనున్నారు. సభా ప్రాంగణం వద్ద అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు.