ఇవాళ రాత్రికి హైదరాబాద్‌కు చేరుకోనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. దాదాపు రెండు వారాల పాటు స్విట్జర్లాండ్‌లోని దావోస్, అమెరికాలో పర్యటించిన ఆయన, రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలో శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఫిబ్రవరి 2న మధ్యాహ్నం మంత్రులతో ముఖ్యమంత్రి కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలు, తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్