మెగా అభిమానుల కోసం 'పెద్ది' సినిమా టీమ్ మాస్ ట్రీట్ అందించింది. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలోని తొలి పాట ‘చికిరి’ నవంబర్ 7న విడుదల కానుంది. పాట ప్రోమోలో రామ్ చరణ్ వేసిన హుక్ స్టెప్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. అభిమానులు ఏఐ టెక్నాలజీతో చిరంజీవి, పవన్ కళ్యాణ్ కూడా అదే స్టెప్ వేస్తున్నట్లు వీడియో సృష్టించారు. ఆ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.