కట్ట మైసమ్మ గుడి వివాదంపై స్పందించిన చికోటి ప్రవీణ్ (వీడియో)

TG: నేరెడ్‌మెట్ పీఎస్ పరిధిలోని కట్ట మైసమ్మ గుడి వివాదంపై బీజేపీ నేత చికోటి ప్రవీణ్ స్పందించారు. బొడ్రాయిపై ఓ వ్యక్తి మూత్రం పోసి అపవిత్రం చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిందన్నారు. ఈ ఘటనపై నిందితుడికి మతిస్థిమితం లేదని పోలీసులు కొత్త కథలు అల్లితే సహించేది లేదని హెచ్చరించారు. దేశంలో హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. గుడులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం తేలికగా తీసుకోకూడదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్