వేడి సాంబారు గిన్నెలో పడి చిన్నారి మృతి

AP: వేడి సాంబారు గిన్నెలో పడి చిన్నారి మృతి చెందింది. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలంలో చోటు చేసుకుంది. వానపాములకు చెందిన ప్రవీణ్‌కుమార్ దంపతులు తమ నాలుగేళ్ల కుమార్తె ప్రేరణతో కలిసి ఆదివారం ఫంక్షన్‌ వెళ్లారు. చిన్నారి ఆడుకుంటూ భోజనానికి సిద్ధం చేసిన సాంబారు గిన్నెపై కూర్చింది. ప్లేటు పక్కకు ఒరగడంతో ఒక్కసారిగా వేడి సాంబారులో పడిపోయింది. దాంతో చిన్నారి శరీరం పూర్తిగా కాలిపోయింది. చిన్నారిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది.

సంబంధిత పోస్ట్