గొంతులో బిస్కెట్ ఇరుక్కుని చిన్నారి మృతి

TG: మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట మండల పరిధిలోని సుర్తి తండాలో శనివారం రాత్రి బిస్కెట్ గొంతులో ఇరుక్కుని ఓ చిన్నారి మృతి చెందాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. మూడవత్ శ్రీను, మౌనిక దంపతులకు ఇద్దరు కుమారులు. ఆ చిన్నారులకు తల్లి మౌనిక బిస్కెట్లు ఇచ్చి ఇంట్లోకి వెళ్లింది. అయితే బిస్కెట్ తింటుండగా ఓ చిన్నారి గొంతులో ఇరుక్కోవడంతో శ్వాస ఆడక కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఏడాది చిన్నారి మృతితో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕