UPలోని మురాదాబాద్‌లో విషాదం చోటు చేసుకుంది. జలాల్పూర్ గ్రామంలో ట్యూబ్‌వెల్ వద్ద స్నానం చేస్తున్న చిన్నారి అక్కడే పడి ఉన్న హైటెన్షన్ తీగకు తాకి షాక్‌తో మృతి చెందాడు. అన్నలతో కలిసి ట్యూబ్వెల్కి వెళ్లిన అతను అప్రమత్తంగా లేక హైటెన్షన్ తీగను తాకాడు. ఒక్కసారిగా విద్యుత్ ప్రవహించడంతో ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. ఈ ఘటన కుందర్కీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఘటనతో గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.