అమెరికాలో మీజిల్స్ (తట్టు) వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. న్యూయార్క్‌లోని లూయిస్ కౌంటీలో మీజిల్స్ బారినపడిన చిన్నారి సోమవారం మరణించింది. గత 30 ఏళ్లలో రాష్ట్రంలో ఈ వ్యాధితో మరణం నమోదవడం ఇదే తొలిసారి. అక్టోబర్ 29 నాటికి దేశవ్యాప్తంగా 4,852 కేసులను సీడీసీ ధృవీకరించగా, న్యూయార్క్‌లో 178 కేసులు నమోదయ్యాయి. టీకా కార్యక్రమాలు, నివారణ చర్యలు బలోపేతం చేయాలని అధికారులు సూచిస్తున్నారు.