యూపీ మెయిన్‌పురిలోని భోగావ్ నగర్ పంచాయతీలో ఓ చిన్నారికి ఇటీవల ప్రాణాపాయం తప్పింది. ఆరేళ్ల బాలిక డ్రెయిన్ గోడ వెంట నడుస్తూ స్కూల్‌కు వెళ్తోంది. భారీ వర్షాల కారణంగా రోడ్లు నీటితో నిండిపోవడంతో ఆమె ఇలా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మధ్యలో పట్టుతప్పి ఆమె కింద పడింది. బురదలో పడి స్వల్ప గాయాల పాలైంది. అదృష్టవశాత్తూ డ్రెయిన్‌లో పడకపోవడంతో ప్రమాదం తప్పినట్లైంది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.