TG: రేవంత్ సర్కార్ పిల్లల కోసం బాల భరోసా పథకం ప్రారంభించనుంది. ఇందులో భాగంగా ఐదేళ్లలోపు పిల్లల్లో ఉండే మానసిక, శారీరక వైకల్యాలను గుర్తించి చికిత్స అందించనుంది. అంగన్‌వాడీ సెంటర్ల ద్వారా పిల్లలకు టెస్టులు చేసి గుర్తించనున్నారు. పరీక్షల్లో ఏదైనా సమస్య ఉందని తేలితే ప్రభుత్వమే ఉచితంగా వైద్యం చేయించనుంది. సర్జరీలు, ఫిజియోథెరపీ వంటివి చేస్తారు. ఈ స్కీమ్ ఈ నెల నుంచే అమలు చేయనున్నట్లు సమాచారం.