మహారాష్ట్రలోని జాల్నా జిల్లా జాఫరాబాద్‌లో మానవత్వం మంటగలిసే ఘటన వెలుగుచూసింది. డబ్బుల గొడవ నేపథ్యంలో ఒక చిన్నారి చేతులు, కాళ్లు కట్టేసి, తల్లి రెండో భర్త అత్యంత దారుణంగా కొట్టాడు. ఈ భయానక దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీనిపై వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఆ చిన్నారిని సురక్షితంగా రక్షించి, సంరక్షణ కోసం బంధువులకు అప్పగించారు.