పంజాబ్ లోని లుధియానాలో ప్రమాదం చోటు చేసుకుంది. పాఠశాల నుంచి చిన్నారులతో కలిసి బైక్‌పై తిరిగి వస్తున్న తండ్రి తెరిచి ఉన్న మ్యాన్ హోల్ లో పడిపోయారు. అయితే ఈ ప్రమాదంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ గుంతపై మూతపెట్టకుండా వదిలేయడంపై మున్సిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్యంగా ఉందంటూ విమర్శిస్తున్నారు.