‘పిల్లల ఎక్స్, ఇన్‌స్టా ఖాతాలను ఆధార్‌‌తో అనుసంధానం చేయాలి’

చిన్న పిల్లల ఎక్స్‌, ఇన్‌స్టా ఖాతాలను ఆధార్‌ నెంబర్‌తో అనుసంధానం చేయాలని నటుడు సాయి దుర్గా తేజ్‌ సూచించారు. ఇవాళ అభయం మసూమ్‌-25లో ఆయన పాల్గొని మాట్లాడారు. సామాజిక మాధ్యమాల్లో పిల్లల పట్ల అశ్లీలత, అసభ్యతను తగ్గించాలంటే ఆధార్ కార్డు జత చేయడం తప్పనిసరి చేయాలని అభిప్రాయపడ్డారు. ‘సామాజిక మాధ్యమాల్లో అశ్లీలతను వ్యాప్తి చేస్తున్న వారికి రేపు పిల్లలు పుడతారు కదా! వారి గురించి ఇలాగే మాట్లాడతారా?  అసలు వాళ్లకు నైతికత ఉందా’ అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్