పిల్లలను వాషింగ్‌ మెషీన్‌లో పెట్టి చిత్రహింసలు.. కేసు నమోదు

బెంగళూరులోని ఒక ఐటీ క్యాంపస్‌లో ఉన్న డేకేర్ సెంటర్‌లో పిల్లలను శారీరకంగా హింసించిన వీడియోలు బయటపడ్డాయి. ఈ ఘటనపై ఐదుగురు మహిళా సంరక్షకులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. రెండేళ్ల నుంచి మూడేళ్ల వయసున్న పిల్లలు ఏడ్చినా, అల్లరి చేసినా.. ఆయాలు వారిని బెదిరించినట్లు వీడియోల్లో ఉంది. మరోవైపు పిల్లలను ఫ్రంట్ లోడ్‌ వాషింగ్ మెషీన్‌లో పెట్టడం, వెస్ట్రన్ టాయిలెట్‌పై కూర్చోబెట్టడం, టాయిలెట్ జెట్ స్ప్రే ఉపయోగించి నోటిలోకి నీళ్లు చల్లడం, బాత్‌రూమ్‌ల్లో బంధించడం వంటివి చేశారని ఆరోపణలు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్