చైనాకు ‘నిఫా’ భయం.. విమానాశ్రయాల్లో స్క్రీనింగ్‌!

చైనాలో నిఫా వైరస్ భయం నెలకొంది. ముందు జాగ్రత్త చర్యగా, భారత్‌తో సహా వైరస్ ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులకు విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ ప్రక్రియను ప్రారంభించారు. బీజింగ్‌కు చేరుకున్న భారతీయ ప్రయాణికుల ప్రకారం, చైనా అధికారులు స్వాబ్ పరీక్షలు నిర్వహిస్తున్నారని 'పీటీఐ' వార్తాసంస్థ నివేదించింది. చైనా వ్యాధి నియంత్రణ, నిర్మూలనా కేంద్రం తమ దేశంలో నిఫా కేసులు నమోదు కాలేదని తెలిపింది.

సంబంధిత పోస్ట్