బట్టతలతో బాధపడేవారికి చైనా శుభవార్త చెప్పింది. చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన కొత్త హెయిర్ సీరం కేవలం 20 రోజుల్లోనే బట్టతలపై జుట్టు మొలిపించగలదని వెల్లడించారు. ఇది నిద్రాణంగా ఉన్న జుట్టు మూలకణాలను మేల్కొలిపి, జుట్టు రాలిపోవడం పూర్తిగా ఆపేస్తుందట. ప్రారంభ ప్రయోగాలు సానుకూల ఫలితాలు ఇవ్వడంతో త్వరలోనే ఈ సీరాన్ని మార్కెట్లో విడుదల చేయడానికి చైనా సిద్ధమవుతోంది.