మెగా డ్యామ్‌ను నిర్మిస్తున్న చైనా.. భారత్‌కు ముప్పు

అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో చైనా నిర్మిస్తున్న మెగా డ్యామ్‌ విషయమై సీఎం పెమా ఖండూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. యార్లుంగ్ త్సాంగ్పో నదిపై చైనా నిర్మిస్తున్న డ్యామ్‌ 'వాటర్ బాంబ్'లా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. చైనా నుంచి సైనిక ముప్పుతో పోలిస్తే, ఇది అంతకన్నా పెద్ద ముప్పు అని అన్నారు. ఇది తీవ్ర ఆందోళన కలిగించే విషయమని, అంతర్జాతీయ జల ఒప్పందంపై చైనా సంతకం చేయకపోవడమే దీనికి కారణమని అన్నారు.

సంబంధిత పోస్ట్