చైనా 140 కోట్ల మందికి పైగా ప్రజలపై నిఘా పెట్టినట్లు అమెరికా మీడియా సంచలన కథనం వెలువరించింది. విదేశీయుల వ్యక్తిగత వివరాలు, ప్రయాణ సమాచారం, ఫోన్ సిగ్నల్స్, కెమెరాల ద్వారా ట్రాకింగ్ చేసినట్లు పేర్కొంది. ముఖ్యంగా చైనాలోని జాంగ్‌జియాకోవు నగరానికి వెళ్లిన భారత్, తైవాన్, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా వంటి దేశాల విదేశీయుల వివరాలు అధికంగా ఒక వెబ్‌సైట్‌లో ఉన్నట్లు సైబర్ పరిశోధకుడు గుర్తించారు. అయితే ఈ కథనాలపై చైనా ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.