సుమారు ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, చైనా జాతీయ విమానయాన సంస్థ 'ఎయిర్ చైనా' సోమవారం నుంచి బీజింగ్, ప్యాంగ్యాంగ్ మధ్య నేరుగా విమాన సర్వీసులను పునఃప్రారంభించింది. కొవిడ్-19 ఆంక్షల తర్వాత ఇరు దేశాల మధ్య వైమానిక సంబంధాలు మళ్లీ పట్టాలెక్కాయి. ఎకానమీ క్లాస్ టికెట్ ధర సుమారు 200 డాలర్లుగా ఉంది. అయితే, ఉత్తర కొరియా ఇంకా పర్యాటక వీసాలపై స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం అధికారిక పనుల మీద వెళ్లేవారు మాత్రమే ప్రయాణిస్తున్నారు.