పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో హార్ముజ్ జలసంధి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హార్ముజ్ మార్గంలో 700కు పైగా చమురు ట్యాంకర్లు నిలిచిపోయినట్లు సమాచారం. దీంతో చమురు, గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడి ప్రపంచ మార్కెట్లలో ధరలు పెరుగుతున్నాయి. ఈ మేరకు హార్ముజ్‌ను తెరిచి ఉంచాలని చైనా, ఇరాన్‌పై తీవ్ర ఒత్తిడి తెస్తోందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ముఖ్యంగా ఖతార్ ఎల్‌ఎన్‌జీ ఎగుమతులపై ప్రభావం పడుతోందని, వెంటనే హార్ముజ్‌ను తెరవాలని చైనా పట్టుబట్టిందని సమాచారం.