3 కంటెయినర్ల ఎండుమిర్చిని తిరస్కరించిన చైనా

భారతదేశం నుండి ఎగుమతి అయిన మూడు ఎండుమిర్చి కంటెయినర్లలో పురుగుమందుల అవశేషాలు ఉన్నాయని చైనా తిరస్కరించింది. మే నెలలో చైనాకు చేరిన ఈ మిర్చిలో మిథామిడోపాస్‌ అనే రసాయనం అధికంగా ఉన్నట్లు గుర్తించి, మూడు భారతీయ కంపెనీలను బ్లాక్‌లిస్టులో పెట్టింది. దీనివల్ల ఎగుమతిదారులు రవాణా ఛార్జీలు, వెయిటింగ్‌ రుసుములు పెరిగి నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిగా ఆరబెట్టకుండా ప్యాక్ చేయడం వల్ల కూడా బూజు పట్టడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఏపీ నుంచి ఎగుమతయ్యే మిర్చిలో సింహభాగం చైనాకే వెళ్తుంటుంది.

సంబంధిత పోస్ట్