చైనా సరికొత్త ఆవిష్కరణ.. విమానంతో పోటీ పడే రైలు

చైనా సాంకేతిక రంగంలో మరో ముందడుగు వేసింది. బీజింగ్‌ ఇటీవల 17వ మోడ్రన్ రైల్వేస్ ఎగ్జిబిషన్‌లో మ్యాగ్‌లెవ్‌ ఆధారిత హైస్పీడ్ ట్రైన్‌ను పరిచయం చేసింది. గంటకు 600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల ఈ ట్రైన్‌ కేవలం 7 సెకన్లలోనే ఆ వేగాన్ని చేరుకుంటుంది. బీజింగ్ నుంచి షాంఘై వరకు ఉన్న 1200 కిమీ దూరాన్ని ఇది కేవలం 150 నిమిషాల్లో పూర్తి చేస్తుందని అధికారులు తెలిపారు. మ్యాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీతో ఫ్రిక్షన్ లేకుండా నిశ్శబ్దంగా ఈ రైలు పరుగెడుతుంది.

సంబంధిత పోస్ట్